Friday, October 10, 2008

అనాథ .......!

అనాథ
పొట్టకూటికోసం పోరాటం
చెత్తకుండిలతో చెలగాటం
ఒక ముద్దయినా దొరుకుతుందని
నా విశ్వాసం.
పగలంతా ప్రతి గొంది,సంది తిరిగి
సాయంత్రం దోమలనే దోస్తులతో
సేదతీర్చుకునే చిన్నారి జీవితంనాజీవితం
నా అనాధ జీవితం.
నాకు ఈగతి పట్టించిన
కాలుజారినతల్లి ఎవరో
కల్లుకావరమెక్కిన తండ్రి ఎవడో
వారు కనిపిస్తే ఆవేశంగా అడగాలని వుంది
మీసుఖసంతోషాలకోసం
నన్ను ఎందుకుబలిపశువుని చేశారని
ఈ అవనిలో అనాధగ ఎందుకు అవతరింపచేశారని
వారిని నిలదీసి అడగాలని
ఆశగావుంది
అడగలేను అడగకుండా ఉండలేను
వారు మరో రూపంలో ఇంకో తమ్మున్ని
అనాధని చేయటానికి ఏ రూపం
ఎత్తారో తెలియదు కదా
అందుకే నా జీవితం ఇంతే
నేను నిజంగానే ఆ నాధుని బిడ్డని !

Friday, March 28, 2008


Thursday, March 20, 2008

నాజీవనం సాగించేదెట్టా.....?

నిలకడలేని నీటిలా కాలం పారుతుంటే
ఇవతల ఒడ్డున నేను
అవతల ఒడ్డున నా ఆలోచన
ఆగని కెరటంలా సుడులు తిరుగుతూ
దూరం నుంచి ఎదురు చూస్తుంది
అవతల ఒడ్డున ఆశయాన్ని అందుకోలేక
ఇవతల ఒడ్డున ఇబ్బందిని ఎదురుకోలేక
ఆశయాల చిగురుల్ని కప్పలేక కప్పకుండ ఉండలేక
అవస్త పడుతుంటే అసంతృప్తి నగ్నసత్యంలా
సిగ్గుపడుతూ చెంతకొస్తుంది
చెరువులో చాపపిల్లను కొంగ మింగినట్టు
కలియుగంలో నన్ను కులం కబలిస్తోంది
కలియుగంలో విలువ కులానికా?కాలానికా?
మతానకా?మనిషికా?మనిషి నైపుణ్యానికా?
గత కాలాన్ని గుర్తు చేసుకుంటే,
సమకాలాన్నీ సరిచూసుకుంటేసిగ్గనిపిస్తుంది
నాకు దీన్నీ భరించేదిఎట్ట ...?
నేటిజీవన అరుగులపై రాజకీయాలరెట్ట...?
దీన్ని తుడుద్దాం అన్నవారిని నక్సలైటు అన్నారు ఎట్ట?
ప్రభుత్వ పథకాలు ప్రభువులకే పరిమితాలు
అవి అంతు పట్టని ఆత్మకథలు
ఈ పథకాలు ప్రజల పతనానికి పునాది రాళ్ళు
ఈ పతన పునాది రాళ్ళపై నా బతుకు బాటనుకొనసాగించేది ఎట్ట?
కరుణించే నాథుడు ఎక్కడున్నాడంట?
ఎట్టా......?ఇంకెట్టా........?
నాజీవనం సాగించేదెట్టా.....?

Wednesday, February 13, 2008

మానవత్వం మరోసారి.......!!!!

మానవత్వం మూఢత్వం అవుతుంటే
మూఢత్వం మతతత్వం అవుతుంటే
సమానత్వం సంకుచితం అవుతుంటే
సంకుచితం వ్యక్తిత్వం అవుతుంటే
వ్యక్తిత్వం విభిన్నరూపాల అరాచికత్వం అవుతుంటే
ఈ జీవనం ఎందుకు ?
పల్లె సీమల శాంతితత్వం
నాగరికత నాటకతత్వం అవుతుంటే
నాటకతత్వం యంత్రాల ఉచ్చులో
కుందేళ్ళలా నక్కి నక్కి చూస్తుంటే
ప్రపంచీకరణ ప్రాణాంతకరణగా మారుతుంటే
ఈ జీవనం ఎందుకు?
ఈ దేశం అగ్రనేతల ఆదిపత్యంతో సతమవుతుంటే
తాకట్టుపెట్టడానికి తావు అయినా లేదు అని
నాతల్లితన్మయత్నం చెందుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
పట్టుచీర పటుత్వం పరాదీనం అవుతుంటే
స్త్రీల మాతృత్వం ఫ్యాషన్ల తత్వం అవుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
నైతిక తత్వం రంగుపూసుకున్న
నీచత్వంగా నడుస్తుంటే
మానవత్వం ముసుకువేసుకుని
మూర్ఖత్వం సాగిస్తే
రక్తసంబందం పేరిట రాక్షసతత్వం నడుస్తుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
అధికార పధకాలు,పన్నాగాలు
ప్రతిపక్షాలకు శభధాలుగా మారుతుంటే
ఆ శభధాలు ప్రజలకు శాపాలు అయి
శవాలుగా మారుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
స్త్రీల మాన శీలాలు మార్కెట్లో మాంసపుముద్దలై
అవసరాన్ని బట్టి అవయవానికి ఒక కరేన్సి కేటాయిస్తే
నాకు ఏందుకు ఈ జీవనం,?
మనది మనిషితత్వం
ఇది జగమెరిగిన జీవన సత్యం
అనుదినం ఆలోచింపజేసే ఆదర్శతత్వం ....
మన మానవత్వం ........
ఈ మనిషి తత్వం....!

Thursday, January 17, 2008

ఓ!ప్రేయసీ !

ఓ!ప్రేయసీ భాధిస్తావు భాధ పదతావు
నవ్విస్తావు నవ్వుతావు
ఆ నిమిషంలో కన్నిరై కళ్ళముందు ఉంటావు
ఓ!ప్రేయసీ కొంచెం సేపు పువ్వులా పరిమలంగా ఉంటావు
కసేపు ఆదరించె అక్కలా
చేరదీసే చెళ్ళిలా ఉంటావు
మరో కాసేపు ఆదుకునే అన్నలా
తోబుట్టిన తమ్ముడిలా ఉంటావు
ప్రేమిచే ప్రియురాలిగా ఉంటావు
చివరకు అన్ని గుణాలు కలిసిన
కల్పవల్లిలా ఉంటావు
ఓ!ప్రేయసీ కోపానికి సాక్షిగా పగకు ప్రతిరూపంగా
మొండితనానికి మరోరూపంగా
మరో మారు ప్రత్యక్షం అవుతావు
ఓ!ప్రేయసీ ఆలోచిస్తే నా అయుస్సు సరిపోదు ఏమో
నిన్ను అర్ధం చేసుకోవటం ఏందుకో ఇలా........!
నాకేందుకో ఇలా...............!

Wednesday, April 18, 2007

ఎందుకు మారావు?

ఎవ్వరిని అడగాలి
ఏమని అడగాలి
వెళ్ళొస్తానన్నావు మళ్ళొస్తానన్నావు
ఒంటరిగా వెళ్ళావు జంటై నీవచ్చావు
చదువే నీ జీవితమంటూ చంకన పుస్తకాలు పెట్టి
ఒట్టేసి వెళ్ళావు ఒంటరిగా వెళ్ళావు
చదువేమో చినబోయింది
జీవితమే భాధ అయింది
నీ ఆలోచనలకు హద్దులు లేవు
ఆశయాన్ని అంతంచేసి ఆలోచిస్తున్నావు
ఎందుకు మారావు ?ఎలాగా మారావు ?
ఎవరికోసం మారావు?
ఆప్యాత అనుభందం అక్కడనే నేర్చుకున్నావు
బందాలు భాందవ్యాలు బాగానే నేర్చావు
అలోచనే అనితరమై ఆమె నీ జీవితం అంటూ
అనుదినం భాధ పడుతూ బ్రతికేస్తున్నావు
అమ్మ,నాన్న గుర్తుకురారు
అక్క తమ్ముళ్ళు అసలు జ్ఞాపకం రారు
ఎందుకు మారావు?
ఎలాగా మారావూ?
ఎందుకు మారావు?