Thursday, March 20, 2008

నాజీవనం సాగించేదెట్టా.....?

నిలకడలేని నీటిలా కాలం పారుతుంటే
ఇవతల ఒడ్డున నేను
అవతల ఒడ్డున నా ఆలోచన
ఆగని కెరటంలా సుడులు తిరుగుతూ
దూరం నుంచి ఎదురు చూస్తుంది
అవతల ఒడ్డున ఆశయాన్ని అందుకోలేక
ఇవతల ఒడ్డున ఇబ్బందిని ఎదురుకోలేక
ఆశయాల చిగురుల్ని కప్పలేక కప్పకుండ ఉండలేక
అవస్త పడుతుంటే అసంతృప్తి నగ్నసత్యంలా
సిగ్గుపడుతూ చెంతకొస్తుంది
చెరువులో చాపపిల్లను కొంగ మింగినట్టు
కలియుగంలో నన్ను కులం కబలిస్తోంది
కలియుగంలో విలువ కులానికా?కాలానికా?
మతానకా?మనిషికా?మనిషి నైపుణ్యానికా?
గత కాలాన్ని గుర్తు చేసుకుంటే,
సమకాలాన్నీ సరిచూసుకుంటేసిగ్గనిపిస్తుంది
నాకు దీన్నీ భరించేదిఎట్ట ...?
నేటిజీవన అరుగులపై రాజకీయాలరెట్ట...?
దీన్ని తుడుద్దాం అన్నవారిని నక్సలైటు అన్నారు ఎట్ట?
ప్రభుత్వ పథకాలు ప్రభువులకే పరిమితాలు
అవి అంతు పట్టని ఆత్మకథలు
ఈ పథకాలు ప్రజల పతనానికి పునాది రాళ్ళు
ఈ పతన పునాది రాళ్ళపై నా బతుకు బాటనుకొనసాగించేది ఎట్ట?
కరుణించే నాథుడు ఎక్కడున్నాడంట?
ఎట్టా......?ఇంకెట్టా........?
నాజీవనం సాగించేదెట్టా.....?