Wednesday, February 13, 2008

మానవత్వం మరోసారి.......!!!!

మానవత్వం మూఢత్వం అవుతుంటే
మూఢత్వం మతతత్వం అవుతుంటే
సమానత్వం సంకుచితం అవుతుంటే
సంకుచితం వ్యక్తిత్వం అవుతుంటే
వ్యక్తిత్వం విభిన్నరూపాల అరాచికత్వం అవుతుంటే
ఈ జీవనం ఎందుకు ?
పల్లె సీమల శాంతితత్వం
నాగరికత నాటకతత్వం అవుతుంటే
నాటకతత్వం యంత్రాల ఉచ్చులో
కుందేళ్ళలా నక్కి నక్కి చూస్తుంటే
ప్రపంచీకరణ ప్రాణాంతకరణగా మారుతుంటే
ఈ జీవనం ఎందుకు?
ఈ దేశం అగ్రనేతల ఆదిపత్యంతో సతమవుతుంటే
తాకట్టుపెట్టడానికి తావు అయినా లేదు అని
నాతల్లితన్మయత్నం చెందుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
పట్టుచీర పటుత్వం పరాదీనం అవుతుంటే
స్త్రీల మాతృత్వం ఫ్యాషన్ల తత్వం అవుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
నైతిక తత్వం రంగుపూసుకున్న
నీచత్వంగా నడుస్తుంటే
మానవత్వం ముసుకువేసుకుని
మూర్ఖత్వం సాగిస్తే
రక్తసంబందం పేరిట రాక్షసతత్వం నడుస్తుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
అధికార పధకాలు,పన్నాగాలు
ప్రతిపక్షాలకు శభధాలుగా మారుతుంటే
ఆ శభధాలు ప్రజలకు శాపాలు అయి
శవాలుగా మారుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
స్త్రీల మాన శీలాలు మార్కెట్లో మాంసపుముద్దలై
అవసరాన్ని బట్టి అవయవానికి ఒక కరేన్సి కేటాయిస్తే
నాకు ఏందుకు ఈ జీవనం,?
మనది మనిషితత్వం
ఇది జగమెరిగిన జీవన సత్యం
అనుదినం ఆలోచింపజేసే ఆదర్శతత్వం ....
మన మానవత్వం ........
ఈ మనిషి తత్వం....!

No comments: