Wednesday, March 7, 2007

పల్లె పశ్చాత్తాపం


నిండు బొండు మల్లె నా పల్లె
ముద్ద మందారం నా పల్లె
పల్లె పడుచులకు ప్రమాణసూచిక నా పల్లె
నాడు,
పైటేసిన నా పల్లె పరిమళాలు వెదజల్లింది
నేడు ఫాంటేసిన నాపల్లె ఫ్యాషన్లను వెదజల్లుతుంది.
*చింతపండు తొక్కు చీదరయింది
ప్రియా పచ్చడి ప్రవేశించింది*
కర్రునాగలి కనిపించటలేదు
ఎద్దు మువ్వల చప్పుడు లేదు
ఎక్కడచూసినా ఇంజన్ ట్రాక్టరులు
బావా మరదళ్ళ ముచ్చటలు లేవు
మేనమామల మందలింపులేదు
బాయ్,గర్ల్ ఫ్రెండులు గజ్జకట్టి తిరుగుతున్నారు
సంక్రాంతి సంబరాలు లేవు
కనుమపండగ కోడిపందాలు లేవు
ఫ్యాక్షనిజం ప్రవేశించింది
పారిపోతున్న పల్లె పటిష్టతను
ప్రభుత్వం పక్కలో పెట్టుకుంది
గొర్రెమందను కాపలా కాయమని
పులిని నియమించిన్నట్టు
ఒక చేత్తో చేరదీసి
మరో చేత్తో చంపేసింది
గాలిని గాలి పటం నమ్ముకున్నట్టు
మేఘాన్ని మాగాని నమ్ముకున్నట్టు
నాపల్లె ప్రభుత్వన్ని నమ్ముకుంది
ప్రభుత్వం పల్లె పోట్టలో గునపాలు దింపింది
గొంతుపిసికి చంపుతుంది,చంపేస్తుంది.





End of messages
« Back to Discussions