Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Thursday, March 20, 2008

నాజీవనం సాగించేదెట్టా.....?

నిలకడలేని నీటిలా కాలం పారుతుంటే
ఇవతల ఒడ్డున నేను
అవతల ఒడ్డున నా ఆలోచన
ఆగని కెరటంలా సుడులు తిరుగుతూ
దూరం నుంచి ఎదురు చూస్తుంది
అవతల ఒడ్డున ఆశయాన్ని అందుకోలేక
ఇవతల ఒడ్డున ఇబ్బందిని ఎదురుకోలేక
ఆశయాల చిగురుల్ని కప్పలేక కప్పకుండ ఉండలేక
అవస్త పడుతుంటే అసంతృప్తి నగ్నసత్యంలా
సిగ్గుపడుతూ చెంతకొస్తుంది
చెరువులో చాపపిల్లను కొంగ మింగినట్టు
కలియుగంలో నన్ను కులం కబలిస్తోంది
కలియుగంలో విలువ కులానికా?కాలానికా?
మతానకా?మనిషికా?మనిషి నైపుణ్యానికా?
గత కాలాన్ని గుర్తు చేసుకుంటే,
సమకాలాన్నీ సరిచూసుకుంటేసిగ్గనిపిస్తుంది
నాకు దీన్నీ భరించేదిఎట్ట ...?
నేటిజీవన అరుగులపై రాజకీయాలరెట్ట...?
దీన్ని తుడుద్దాం అన్నవారిని నక్సలైటు అన్నారు ఎట్ట?
ప్రభుత్వ పథకాలు ప్రభువులకే పరిమితాలు
అవి అంతు పట్టని ఆత్మకథలు
ఈ పథకాలు ప్రజల పతనానికి పునాది రాళ్ళు
ఈ పతన పునాది రాళ్ళపై నా బతుకు బాటనుకొనసాగించేది ఎట్ట?
కరుణించే నాథుడు ఎక్కడున్నాడంట?
ఎట్టా......?ఇంకెట్టా........?
నాజీవనం సాగించేదెట్టా.....?

Wednesday, February 13, 2008

మానవత్వం మరోసారి.......!!!!

మానవత్వం మూఢత్వం అవుతుంటే
మూఢత్వం మతతత్వం అవుతుంటే
సమానత్వం సంకుచితం అవుతుంటే
సంకుచితం వ్యక్తిత్వం అవుతుంటే
వ్యక్తిత్వం విభిన్నరూపాల అరాచికత్వం అవుతుంటే
ఈ జీవనం ఎందుకు ?
పల్లె సీమల శాంతితత్వం
నాగరికత నాటకతత్వం అవుతుంటే
నాటకతత్వం యంత్రాల ఉచ్చులో
కుందేళ్ళలా నక్కి నక్కి చూస్తుంటే
ప్రపంచీకరణ ప్రాణాంతకరణగా మారుతుంటే
ఈ జీవనం ఎందుకు?
ఈ దేశం అగ్రనేతల ఆదిపత్యంతో సతమవుతుంటే
తాకట్టుపెట్టడానికి తావు అయినా లేదు అని
నాతల్లితన్మయత్నం చెందుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
పట్టుచీర పటుత్వం పరాదీనం అవుతుంటే
స్త్రీల మాతృత్వం ఫ్యాషన్ల తత్వం అవుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
నైతిక తత్వం రంగుపూసుకున్న
నీచత్వంగా నడుస్తుంటే
మానవత్వం ముసుకువేసుకుని
మూర్ఖత్వం సాగిస్తే
రక్తసంబందం పేరిట రాక్షసతత్వం నడుస్తుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
అధికార పధకాలు,పన్నాగాలు
ప్రతిపక్షాలకు శభధాలుగా మారుతుంటే
ఆ శభధాలు ప్రజలకు శాపాలు అయి
శవాలుగా మారుతుంటే
నాకు ఎందుకు ఈ జీవనం?
స్త్రీల మాన శీలాలు మార్కెట్లో మాంసపుముద్దలై
అవసరాన్ని బట్టి అవయవానికి ఒక కరేన్సి కేటాయిస్తే
నాకు ఏందుకు ఈ జీవనం,?
మనది మనిషితత్వం
ఇది జగమెరిగిన జీవన సత్యం
అనుదినం ఆలోచింపజేసే ఆదర్శతత్వం ....
మన మానవత్వం ........
ఈ మనిషి తత్వం....!

Thursday, January 17, 2008

ఓ!ప్రేయసీ !

ఓ!ప్రేయసీ భాధిస్తావు భాధ పదతావు
నవ్విస్తావు నవ్వుతావు
ఆ నిమిషంలో కన్నిరై కళ్ళముందు ఉంటావు
ఓ!ప్రేయసీ కొంచెం సేపు పువ్వులా పరిమలంగా ఉంటావు
కసేపు ఆదరించె అక్కలా
చేరదీసే చెళ్ళిలా ఉంటావు
మరో కాసేపు ఆదుకునే అన్నలా
తోబుట్టిన తమ్ముడిలా ఉంటావు
ప్రేమిచే ప్రియురాలిగా ఉంటావు
చివరకు అన్ని గుణాలు కలిసిన
కల్పవల్లిలా ఉంటావు
ఓ!ప్రేయసీ కోపానికి సాక్షిగా పగకు ప్రతిరూపంగా
మొండితనానికి మరోరూపంగా
మరో మారు ప్రత్యక్షం అవుతావు
ఓ!ప్రేయసీ ఆలోచిస్తే నా అయుస్సు సరిపోదు ఏమో
నిన్ను అర్ధం చేసుకోవటం ఏందుకో ఇలా........!
నాకేందుకో ఇలా...............!

Wednesday, April 18, 2007

ఎందుకు మారావు?

ఎవ్వరిని అడగాలి
ఏమని అడగాలి
వెళ్ళొస్తానన్నావు మళ్ళొస్తానన్నావు
ఒంటరిగా వెళ్ళావు జంటై నీవచ్చావు
చదువే నీ జీవితమంటూ చంకన పుస్తకాలు పెట్టి
ఒట్టేసి వెళ్ళావు ఒంటరిగా వెళ్ళావు
చదువేమో చినబోయింది
జీవితమే భాధ అయింది
నీ ఆలోచనలకు హద్దులు లేవు
ఆశయాన్ని అంతంచేసి ఆలోచిస్తున్నావు
ఎందుకు మారావు ?ఎలాగా మారావు ?
ఎవరికోసం మారావు?
ఆప్యాత అనుభందం అక్కడనే నేర్చుకున్నావు
బందాలు భాందవ్యాలు బాగానే నేర్చావు
అలోచనే అనితరమై ఆమె నీ జీవితం అంటూ
అనుదినం భాధ పడుతూ బ్రతికేస్తున్నావు
అమ్మ,నాన్న గుర్తుకురారు
అక్క తమ్ముళ్ళు అసలు జ్ఞాపకం రారు
ఎందుకు మారావు?
ఎలాగా మారావూ?
ఎందుకు మారావు?






Wednesday, March 7, 2007

పల్లె పశ్చాత్తాపం


నిండు బొండు మల్లె నా పల్లె
ముద్ద మందారం నా పల్లె
పల్లె పడుచులకు ప్రమాణసూచిక నా పల్లె
నాడు,
పైటేసిన నా పల్లె పరిమళాలు వెదజల్లింది
నేడు ఫాంటేసిన నాపల్లె ఫ్యాషన్లను వెదజల్లుతుంది.
*చింతపండు తొక్కు చీదరయింది
ప్రియా పచ్చడి ప్రవేశించింది*
కర్రునాగలి కనిపించటలేదు
ఎద్దు మువ్వల చప్పుడు లేదు
ఎక్కడచూసినా ఇంజన్ ట్రాక్టరులు
బావా మరదళ్ళ ముచ్చటలు లేవు
మేనమామల మందలింపులేదు
బాయ్,గర్ల్ ఫ్రెండులు గజ్జకట్టి తిరుగుతున్నారు
సంక్రాంతి సంబరాలు లేవు
కనుమపండగ కోడిపందాలు లేవు
ఫ్యాక్షనిజం ప్రవేశించింది
పారిపోతున్న పల్లె పటిష్టతను
ప్రభుత్వం పక్కలో పెట్టుకుంది
గొర్రెమందను కాపలా కాయమని
పులిని నియమించిన్నట్టు
ఒక చేత్తో చేరదీసి
మరో చేత్తో చంపేసింది
గాలిని గాలి పటం నమ్ముకున్నట్టు
మేఘాన్ని మాగాని నమ్ముకున్నట్టు
నాపల్లె ప్రభుత్వన్ని నమ్ముకుంది
ప్రభుత్వం పల్లె పోట్టలో గునపాలు దింపింది
గొంతుపిసికి చంపుతుంది,చంపేస్తుంది.





End of messages
« Back to Discussions

Tuesday, March 6, 2007

హైకూలూ....!

చంద్రుడు సిగ్గు పడుతున్నాడు
తారల సరసాలతో

ఆకాశం ఆవురావురమంటుంది
ధరణిలోజరిగే దారుణాలు చూడలేక

కార్మికులు కష్టం చేస్తున్నారు
చేతులతో కాదు కాలే కడుపుతో

అసెంబ్లీ అల్లాడుతోంది
అవినీతి నాయకుల ఆరోపణలతో
పార్లమెంటు ప్రాదేయపడుతుంది
ప్రభుత్వ ఖజానాను కొల్ల గొట్టవద్దని

నాడు పిట్టకొంచం
కూత ఘనం
నేడు కరెంటు కొంచం కొరత ఘనం

బతుకు బాటలో అమ్మ బంపర్ ఆఫర్
అమ్మ అస్తమిస్తే అంతా అంధాకారమే

ఎక్కడైనా,ఎప్పుడైనా మానవత్వం కనిపిస్తే బాగుండు
మాట్లాడాలని ఉంది.

నరకం .నరకం అంటునే నరుకుతున్నారు
మరి స్వర్గంలో ఏమి చేస్తారో

నేల మీద నీరు ఆవిరై అంగోరై మన
ఆకలి తీరిస్తుంది.

మద్యం మజాని ఇస్తుంది
మరుక్షణమే మరణాన్ని ఇస్తుంది.
మరో లోకానికి తీసుకెలుతుంది.

Friday, March 2, 2007

తెలుగుతల్లి

  • తల్లి లాంటి తెలుగుతల్లి తల్లడిల్లినా
  • మాటరాక మూగ బోయి మాయ మవుతున్నదా
  • తల్లి ఒడిలో అ,ఆలు నేర్చినపుడు
  • అనురాగంతో ఆదరించినపుడు
  • తెలుగుతల్లి దిక్కు అన్నారు
  • నేడు,బిడ్డ తల్లిని ప్రశ్నించినట్టు
  • తల్లి తలపైన నుంచోని
  • ఆంగ్ల భాషా అహంకారంతో
  • తెలుగుజాతి తెలుగుని ప్రశ్నిస్తుంది
  • తల్లి నీ స్థానం ఎక్కడ...?అని
  • అ,ఆలు చెప్పే అయ్యవారులు అంతరించారు
  • ఎ,బి,సి,డిలు చేప్పే టీచరులు బరిలోకి దిగినారు
  • అ అంటే అమ్మా అని చేప్పే అద్యాపకులు పోయి
  • అ అంటే ఆయుదం అని చెప్పే ఆంగ్లం వారువచ్చారు
  • తల్లి పొత్తిల్లలో పాఠాలు నేర్చుకున్నప్పుడు
  • పవిత్రంగా ఉన్న నా తల్లి
  • ఆంగ్లం అవతరించగానే
  • అంటరానిది అయింది,అసహ్యం కాబడింది.
  • రోడ్డు పక్కన రిక్షావాడు రిజైన్ చేసి
  • ఆటోవాడు హాజరు అయ్యాడు.
  • పార్టీలు పెరిగాయి
  • ప్రభుత్వాలు మారాయి
  • తరాలు మారాయికాని
  • తెలుగు తల్లిరోజురోజుకి తరలి పోతుంది,...' తరిగిపోతుంది.
  • ఉన్నవాడికి,లేనివాడికి తెలుగు అంటే అలుసే
  • ఉన్నవాడు తెలుగు అంటే ఉలిక్కి పడితే
  • లేని వాడు లెక్కచేయటంలేదు
  • ప్రతి వాడికి ఫారెన్ వాడి ఇంగ్లీసు కావాల
  • లేదంటే హెచ్చులుకు అయినాహిందీ రావాలా!
  • ఎండ మావుళ్ళలో,మండుటెండలలో ఒంటె వంటిది ఈ ఇంగ్లీసు
  • నిత్య నూతనంగా జలపాతాల జల జీవన స్రవంతి నా తెలుగు తల్లి.
  • తెలుగు అంటే ప్రతి వారికి తోందరపాటు
  • దీనివలన తెలిసేది ఏమిఉంది అని
  • తెలుగు చెప్పిన చరిత్ర చూడు
  • మహాభారతం చదివిచూడు
  • రామాయణం రాసిచూడు
  • తెలుగు అంటేతెలుస్తుంది.
  • నా జాతి గర్వంగా గద్దెక్కిన రోజులు చూడు
  • నాజాతి అంతరించినా,అవతరించినా
  • ప్రతి తెలుగువాడు ఏనాటికి అయినా
  • తెలుగు తల్లి గుండెలలో తలదాచుకోవాల్సిందే.

Tuesday, February 13, 2007

భూమిపుత్రా.....!

పగలనక రేయి అనక
ఎండనక వాననక
పకృతమ్మే పంతులమ్మగా
చేలగట్లే ఆటస్థలాలుగా

ప్రతి నిమిషం ప్రకృతమ్మ ఒడిలో పాఠాలు నేర్చుకుని

ప్రకృతమ్మనే కాగితంగా చేసుకుని
నాగలని కుంచగా చేసుకుని
ప్రకృతితో పోరాడివరద వచ్చిన, వానోచ్చినా
చీడపట్టిన, చెదలు పట్టినా
వాటిని చేదించిబంజరు భుమిలో
బంగారం పండిచే భూమి పుత్ర...
భరతమాత ముద్దు బిడ్డవు నీవయ్యా..!
సరిరారు నీకుఎవరు సరిలేరు ఇంకెవరు...
ఓ!భూమిపుత్రా...
నీవు పెట్టిన భిక్షే నేడు మేము తింటున్న బువ్వ...
నీ చెమటతోనే నేడు ఈ ధరణి సేద తీర్చుకుంటంది.
కంచే చేను మేసినట్టు
నేడు నిన్ను భునయవంచకులు మేస్తున్నారు
పురుగు మందులను పరమాన్నంగా పేట్టి తినమంటున్నారు
నకిలి విత్తనాలు విక్రయించి నీ నాశనం కోరుతున్నారు
"ఒక వ్యక్తిని మరోవ్యక్తి,ఒక జాతిని మరొజాతి పిక్కుతినే రాక్షస రాజ్యం మనది
ఇలాంటి రాక్షసులు విన్నంతకాలం
భూనయవంచకులు వున్నంతకాలం
నీ బ్రతుకులు బాగుపడవన్న....
అందుకే........
నడుంబిగించాలి నవయువతరం
రైతుబిడ్డ రక్షణకై...
రైతురాజ్య స్థానకై...
"ఆగిందంటే రైతు గుండే
జగతికి తప్పదు మరణమృదంగం".




ప్రేమ .....

ప్రేమ కోసం పోరాటం
ప్రేమకోసమే ఈ అరాటం
ప్రేమిచటమే పరమ లక్ష్యం
"అసలు ప్రేమంటే"
ఇద్దరి యువతి యువకుల మద్య పుట్టే భ్రమ...
యువతి యువకున్ని చూసిన ఆ తొలిరోజు
యువకుడు యువతిని చూసిన ఆ మరసటి రోజు
మరుపురాని ఆ మధుర రోజు
అప్పుడే మోదలైంది వారి పరిచయం...
ఆ పరిచయమే స్నేహం....
ఆ స్నేహమే ప్రేమ....
ఆ ప్రేమే పళ్ళి....!
ఇద అంతా జరిగేది చిన్ని అనతి కాలంలోనే
ఇది ప్రేమ కాదు...వారిద్దరి మద్య పుట్టే ఆకర్షణ
రెండు తనువులు తాపత్రపడే సుఖానికి మారు పేరే ఈ ప్రేమ...
ముగమనసుల మౌనపోరటామే ఈ ప్రేమ...
సమస్యల ఊభిలోకి సన్మార్గాన్ని చూపేదే ఈ ప్రేమ..
అందుకే....మిత్రులారా.....!ప్రేమిచూ,,,,,
కాని ముందు నీ లక్షాన్ని సాధించు
నీ కన్నవారి ఆశలను,నీ ఆశయాలను చిగురిపచేయి
మిత్రమా...జాగ్రత్త.

Monday, February 12, 2007

అమ్మా..!నీఅడుగుజాడలలో...!

జననం ముందు జగతి స్తంబిస్తుంది
ప్రసవం ముందు ప్రాణం రోదిస్తుంది
అమ్మా ఆవేశంలోఆది పరాశక్తివై
,సహనంలో భూదేవివై
పునర్జన్మలాంటి పురిటినొప్పులతో
చనిపోతావో తెలియని అనుమానస్తితిలో
ఈ లోకానికి పరిచయం చేసిన
మాత్రుమూర్తివి నీవమ్మా
నాకు పలక పట్టించేందుకు
నీవు పలుగు,పార పట్టినావు.
విసుగు అనేపదానికి అర్ధం తెలీయకుండా
నిరంతరం శ్రమించే శ్రమజీవివి నీవమ్మా
చిన్నప్పుడు కష్టపడితే తర్వాత ఫలితం వుంటుందని
నీవు చెప్పిన మాటే
నాకు బాటగా నిలిచిందమ్మా
అందుకే అమ్మా నీఅడుగుజాడలో.........
నీ అడుగుజాడలో..........

ఓ!మగువా....

మహాభరతంలో శకుంతల,కుంతీ
మద్యయుగంలో సత్యం కోసం చంద్రమతి
నేటియుగంలో
ఈ నాటికలియుగంలో
తిరుపతిలో రూప
కర్నూల్లో రాములమ్మ
గుజరాత్లో సమ్రత
.....ఇలా ఎంతో మంది మగువలు
ఆనాటినుండి ఈరోజువరకు
పురుషుని పంజాలో ప్రతిదినం బలైపోతున్నారు.
ఓ:మగువా:
నీకు పిత్రుస్వామ్యవ్యవస్తలో
వంచనతప్ప వ్యక్తిత్వం లేదా
మనోవేదన తప్ప మన్శ్శాంతి లేదా
ఓ;మగువా....

కంచే చేను మేసినట్టునీవు
జన్మనిచ్చి- నవాడు నిన్ను
పుట్టినప్పటి నుండిపరమవదించేవరకు
కన్నీటి సాగరంలో ముంచుతున్నాడు

ఓ;మగువా;....

మూఢవిశ్వాసాలు,ఆచారాలు,సాంప్రదాయాలు
పులిలా వచ్చి వెర్రి అరుపులతో
వ్యవస్తను వెక్కిరిస్తు నిన్ను అంతమోందిస్తూవుంటే
నీవు సహనంతో చూస్తున్నావు.
నీసహనం ఎన్నాళ్ళు?
ఎంకెన్నిన్నాళ్ళు?
ఎన్నిఎళ్ళు?ఎంకెన్నిఎళ్ళు?
ఓ:మగువా:......
సహనాన్ని కవచంలా దరించి
అన్ని రంగాలో నీవు శ్రమిస్తావు
నీ అలసినహ్రుదయంపై
అగ్నికి వాయువు తోడ్ఫడినట్టు
నీకు నిరంతరం అవమానాలు,అబండాలు తప్ప
నీకు నీడను కల్పించే నాధుడే లేడా?
ఓ;మగువా;....
ప్రభందాలో కన్యగా వర్ణించారు
నిన్న భావకవులు పూజించారు
నేడు స్త్రీవాదులు శరీరభాగాలను
కవితావస్తువులుగా స్వీకరించారు
స్త్రీ పురుషుడికి మాత్రమే బానిస కాదు
స్త్రీకి స్త్రి బానిస.....
ఎందుకంటే
కన్యగా కట్నం పెళ్ళి వద్దని
అమ్మగా కట్నం ఇచ్చే పెళ్ళి చేయనని
అత్తగా ఖచ్చితంగా కట్నం వసూలు చేసే వ్యవస్త మన భారతవ్యవస్థ.
అందుకే తగా జీవించే జీవితం ఎక్కడ?
ఓ;మగువా;....
తెలుసుకోఈ పురుషాదిక్య వ్యవస్తపై తిరగబడు
నీ జాతిని మేలుకొలుపు
రానున్నా యుగంతా నీదే ...
ఓ;మగువా;...
నా కన్నిళ్ళతో కాళ్ళు కడుగుతానన్న
నీ అన్నయ్యకసాయి వాడు గొర్రెను అమ్మినట్టు
నిన్ను పెళ్ళీ అనే పేరుతో పురుషుడికి దానం చేస్తున్నాడు
ఎందుకంటేవాడు ఒక పురుషుడు కాబట్టి
కొన్నాళ్ళకుకట్నంటేలదని
నీభర్త చంపేస్తేఆ వార్థపత్రికలు,టి.వీ లు వారి ఫోకస్ కోసం
నిన్ను ఉపయెగించుకుంటున్నారు....
ఇలా ప్రతివారు నుండి ఇప్పటివరకు
నిన్ను ఒక వస్తువుగానే చూస్తున్నరు
అందుకే...!
ఓ మగువా;
తెలుసుకోతిరగబడు
నీ జాతిని మేలుకొలుపు
ఎంతటి వానైనా ఒక్క చినుకుతోనే ఆరంభం అవుతుంది.
నేను మనిషిగా పుట్టినందుకు సిగ్గు పడుతున్నా
నేను ఏదో చేయాలని నా తపన
కానీ,ఎమిచేయను
నేను ఒక పురుషుడిఈ వ్యవస్తకు బానిసని
అందుకే.....
నా కలం నుండి జాలువారే ప్రతి అక్ష్రం
మీ కనీటిబొట్టు తుడీచేదిగా వుండాలని,
మీ ధుఖసాగరానికి
నేను ఓ చిన్ని వంతెన నిర్మించాలని
నా చిన్ని ఆశ...
నా జీవితకాల ఆకాంక్ష.

ప్రేమికులరోజు కానుక...!

సర్వంలో సంద్రం నీవు అయితే
అందులో ఉదయించే సూర్యుణ్ణి నేనవుతా

పూలవనంలో పుష్పించే
పూవువి నీవు అయితే
నీ చూట్టు తిరిగే తుమ్మెద నేనవుతా

సూర్యాస్త సమయంలో సమరం చేసి అయినా సరే
వెన్నలను వెదజల్లుతూ
వచ్చే చదమామ నీవైతే
నీ రధ సారదై నేనుంటా

వసంతకాలంలో లేత చిగురులు చిగురించే
చెట్టువు నీవైతేఆచెట్టుపై కమ్మని రాగాలు కూసే
కోయిల నేనవుతా

భూమాత వడిలో
బంగారం పండించే పైరువి నీవైతే
ఆపైరుకు ప్రాణం పోసే నీరుని నేనవుతా

నా తుది శ్వాస విడిచినపుడు
తరంగమల్లె నీవు వచ్చి
పైటకొంగుతో పరిమళాలు వేదజల్లితే
ఆ పరిమళాలతో నా ప్రాణం పుననిర్మించుకుంటా

నీ వడిలో ఓనమాలు దిద్దిన పసిపిల్లాడిలా వుండాలని....
నీ కౌగిటిలోనీ పాదాలచెంత ప్రాణాలు విడవాలని.....
నా చిరకాల వాంచ......!

ప్రజాస్వామ్యమా?పిశాచాలసామ్యమా

నేను గొంతెత్తి గర్జిస్తున్న
ఇది రాజకీయమా?
రంకు నేర్చిన వేశ్యల అడ్డా?
మతి తప్పి అడుగుతున్న!
ఈ మాయా,మర్మం లేని

ఈ మానవలోకంలో ఇంకా మహత్మలువున్నరా?
నేను నిలదీసి అడుగుతున్న
ఇది ప్రజస్వామ్యమా?
పిశాచాల శ్మశాన సామ్యమా?
మళ్ళి అడుగుతున్నఓట్లేసి ఒడ్డు ఎక్కిస్తే
ఆ ఒడ్డున నుంచుని ప్రజలను చూసి నవుతున్నారు.
మీరు నిజంగా నాయకులా?

నీతి తప్పిన నీచులా?
మరోసారి ప్రశ్నిస్తున్న

మీ ఆత్మీయులకు ఆస్తులు,అంతస్తులు
ఆ పక్కన రైతన్నకు ఆత్మహత్యలా?
ఈ దేశం న్యాయానికి నిలయమా?
అన్యాయలకి ఆదర్శమా?
పసిపిల్లాడిలా ప్రశ్నిస్తున్న

]కాలే కడుపుకు కాస్త గంజి
కరువు అవుతున్న న్యాయం
నాకు కొంచెం కావాలి దొరుకుతుందా?

ఈ పాపపులోకంలో.......

మన్నించండి మరలా అడుగుతున్న

గాందీజి గోచరించే గ్రామ స్వరాజ్యం ఎక్కడ?
అంబేద్కర్ ఆశించే ఆదర్శరాజ్యం ఎక్కడ?
పదిమంది పాలుపంచుకునే ప్రజాస్వామ్యమెక్కడ?
ఎక్కడ?ఇంక్కెక్కడ?
ఓ నా ప్రజాస్వామ్యమా
నీవు ఎక్కడ?


అనాథ.....

పొట్టకూటికోసం పోరాటం
చేత్తకుండిలతో చెలగాటం
ఒక ముద్దయినా దొరుకుతుందని
నా విశ్వాసం.
పగలంతా ప్రతి గొంది,సంది తిరిగి
సాయంత్రం దోమలనే దోస్తులతో
సేదతీర్చుకునే చిన్నారిరిజీవితం నజీవితం
నా అనాధ జీవితం.
నాకు ఈగతి పట్టించిన
కాలుజారినతల్లి ఎవరో:
కల్లుకావరమెక్కిన తండ్రి ఎవడో
వారు కనిపిస్తే ఆవేశంగా అడగాలని వుంది
మిసుఖసంతోషాలకోసం
నన్ను ఎందుకుబలిపశువుని చేశారని
ఈ అవనిలో అనాధగ ఎందుకు అవతరింపచేశారని
వారిని నిలదీసి అడగాలని
ఆశగావుంది.......!