Friday, March 2, 2007

తెలుగుతల్లి

  • తల్లి లాంటి తెలుగుతల్లి తల్లడిల్లినా
  • మాటరాక మూగ బోయి మాయ మవుతున్నదా
  • తల్లి ఒడిలో అ,ఆలు నేర్చినపుడు
  • అనురాగంతో ఆదరించినపుడు
  • తెలుగుతల్లి దిక్కు అన్నారు
  • నేడు,బిడ్డ తల్లిని ప్రశ్నించినట్టు
  • తల్లి తలపైన నుంచోని
  • ఆంగ్ల భాషా అహంకారంతో
  • తెలుగుజాతి తెలుగుని ప్రశ్నిస్తుంది
  • తల్లి నీ స్థానం ఎక్కడ...?అని
  • అ,ఆలు చెప్పే అయ్యవారులు అంతరించారు
  • ఎ,బి,సి,డిలు చేప్పే టీచరులు బరిలోకి దిగినారు
  • అ అంటే అమ్మా అని చేప్పే అద్యాపకులు పోయి
  • అ అంటే ఆయుదం అని చెప్పే ఆంగ్లం వారువచ్చారు
  • తల్లి పొత్తిల్లలో పాఠాలు నేర్చుకున్నప్పుడు
  • పవిత్రంగా ఉన్న నా తల్లి
  • ఆంగ్లం అవతరించగానే
  • అంటరానిది అయింది,అసహ్యం కాబడింది.
  • రోడ్డు పక్కన రిక్షావాడు రిజైన్ చేసి
  • ఆటోవాడు హాజరు అయ్యాడు.
  • పార్టీలు పెరిగాయి
  • ప్రభుత్వాలు మారాయి
  • తరాలు మారాయికాని
  • తెలుగు తల్లిరోజురోజుకి తరలి పోతుంది,...' తరిగిపోతుంది.
  • ఉన్నవాడికి,లేనివాడికి తెలుగు అంటే అలుసే
  • ఉన్నవాడు తెలుగు అంటే ఉలిక్కి పడితే
  • లేని వాడు లెక్కచేయటంలేదు
  • ప్రతి వాడికి ఫారెన్ వాడి ఇంగ్లీసు కావాల
  • లేదంటే హెచ్చులుకు అయినాహిందీ రావాలా!
  • ఎండ మావుళ్ళలో,మండుటెండలలో ఒంటె వంటిది ఈ ఇంగ్లీసు
  • నిత్య నూతనంగా జలపాతాల జల జీవన స్రవంతి నా తెలుగు తల్లి.
  • తెలుగు అంటే ప్రతి వారికి తోందరపాటు
  • దీనివలన తెలిసేది ఏమిఉంది అని
  • తెలుగు చెప్పిన చరిత్ర చూడు
  • మహాభారతం చదివిచూడు
  • రామాయణం రాసిచూడు
  • తెలుగు అంటేతెలుస్తుంది.
  • నా జాతి గర్వంగా గద్దెక్కిన రోజులు చూడు
  • నాజాతి అంతరించినా,అవతరించినా
  • ప్రతి తెలుగువాడు ఏనాటికి అయినా
  • తెలుగు తల్లి గుండెలలో తలదాచుకోవాల్సిందే.