Monday, February 12, 2007

ప్రజాస్వామ్యమా?పిశాచాలసామ్యమా

నేను గొంతెత్తి గర్జిస్తున్న
ఇది రాజకీయమా?
రంకు నేర్చిన వేశ్యల అడ్డా?
మతి తప్పి అడుగుతున్న!
ఈ మాయా,మర్మం లేని

ఈ మానవలోకంలో ఇంకా మహత్మలువున్నరా?
నేను నిలదీసి అడుగుతున్న
ఇది ప్రజస్వామ్యమా?
పిశాచాల శ్మశాన సామ్యమా?
మళ్ళి అడుగుతున్నఓట్లేసి ఒడ్డు ఎక్కిస్తే
ఆ ఒడ్డున నుంచుని ప్రజలను చూసి నవుతున్నారు.
మీరు నిజంగా నాయకులా?

నీతి తప్పిన నీచులా?
మరోసారి ప్రశ్నిస్తున్న

మీ ఆత్మీయులకు ఆస్తులు,అంతస్తులు
ఆ పక్కన రైతన్నకు ఆత్మహత్యలా?
ఈ దేశం న్యాయానికి నిలయమా?
అన్యాయలకి ఆదర్శమా?
పసిపిల్లాడిలా ప్రశ్నిస్తున్న

]కాలే కడుపుకు కాస్త గంజి
కరువు అవుతున్న న్యాయం
నాకు కొంచెం కావాలి దొరుకుతుందా?

ఈ పాపపులోకంలో.......

మన్నించండి మరలా అడుగుతున్న

గాందీజి గోచరించే గ్రామ స్వరాజ్యం ఎక్కడ?
అంబేద్కర్ ఆశించే ఆదర్శరాజ్యం ఎక్కడ?
పదిమంది పాలుపంచుకునే ప్రజాస్వామ్యమెక్కడ?
ఎక్కడ?ఇంక్కెక్కడ?
ఓ నా ప్రజాస్వామ్యమా
నీవు ఎక్కడ?


No comments: